యూట్యూబర్‌ వీడియో షేర్ చేసిన మోదీ

9
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యూట్యూబ్/సోషల్ మీడియా క్రియేటర్ యువరాజ్ చేసిన రీల్‌ను షేర్ చేస్తూ ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా చేసిన వినూత్న అభ్యర్థనపై స్పందిస్తూ, అతని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని, ముఖ్యంగా చక్కెర వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

యువరాజ్ దువా తన రీల్‌లో సరదాగా ప్రధాన మంత్రిని ఉద్దేశించి…మీ మాటలు పెద్దలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. మీరు ‘Mann Ki Baat’ కార్యక్రమంలో చక్కెర వినియోగం గురించి మాట్లాడితే, నా నాన్న స్వీట్లు తినడం తగ్గించవచ్చు అని చెప్పాడు. మేము చెప్పినా జిలేబీలు తగ్గడం లేదు అని హాస్యంగా పేర్కొన్నారు.

దీనికి స్పందించిన మోదీ, సరదా శైలిలోనే కానీ ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా సందేశం ఇచ్చారు. అతని నాన్న మాత్రమే కాదు, అందరూ చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

అదనంగా, అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊబకాయం (Obesity) వంటి ప్రమాదాలను వివరించే గ్రాఫిక్‌ను కూడా షేర్ చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయాలని సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Dua (@yuvraj.dua)

Also Read:రవీంద్ర తేజ్.. ‘లవ్‌వాలా’

- Advertisement -