తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలోఏఐఏడీఎంకే నేత పళనిస్వామి (EPS)పై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నప్పటికీ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో EPS ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆయన ప్రకారం, ఏఐఏడీఎంకే దృష్టి తమిళనాడు ప్రజలపై కాకుండా ఇతర విషయాలపై ఉందని విమర్శించారు.
EPS ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర నాయకులతో సమావేశాలు జరపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలు ప్రధానంగా బీజేపీతో కూటమి, సీటు పంచుకునే అంశాలపై జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్…రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లాభాల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డీఎంకే–ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. ఇరు పార్టీలూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే నేతృత్వంలోని కూటమి మరియు ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమి మధ్య ఉండనుంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ విమర్శలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

