ఐపీఎల్ 2026 ప్రారంభమ్యాచ్‌లకు ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరమయ్యేఏ అవకాశం ఉంది. స్టార్క్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు సీనియర్ పేసర్లను కూడా టోర్నమెంట్ ప్రారంభ దశలో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే వారాల్లో అతని ఫిట్‌నెస్ పురోగతిని బట్టి మాత్రమే తిరిగి ఆడే అవకాశంపై నిర్ణయం తీసుకుంటారు.
36 ఏళ్ల స్టార్క్ ఇటీవల యాషెస్‌లో అన్ని ఐదు టెస్టుల్లో పాల్గొన్నాడు. అనంతరం బిగ్ బాష్ లీగ్ చివరి దశ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. దీనివల్ల అతనిపై పనిభారం ఎక్కువైంది.
గత సంవత్సరం టి20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం స్టార్క్ ఆస్ట్రేలియా జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆగస్టు నుంచి వచ్చే 12 నెలల్లో ఆస్ట్రేలియా దాదాపు 21 టెస్టులు ఆడే అవకాశముంది. ఇందులో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలు ఉన్నాయి. అలాగే 2027 వన్డే ప్రపంచకప్ కూడా ముందుంది.
ఈ నేపథ్యంలో స్టార్క్‌పై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతను ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవడం జట్టుకు పెద్ద లోటుగా భావిస్తున్నారు.
ఇదే విధంగా ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్‌వుడ్ కూడా ప్రారంభ దశ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. నాథన్ ఇల్లిస్ కూడా హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

