సజీవంగానే ‘మొజ్తాబా ఖమేనీ’!

7
- Advertisement -

ఇరాన్ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులకు పుల్‌స్టాప్ పడింది. ఈ మేరకు IRIB ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో మొజ్తాబా ఖమేనీ సజీవంగానే ఉన్నారని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అనుమానాలను కొట్టిపారేశారు.

ఇటీవలి రోజుల్లో మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మరణించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా వీడియోతో ఆ వదంతులకు చెక్ పడినట్లు అయింది.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తాబా ఖమేనీ మొదటిసారి బాహ్య ప్రపంచానికి కనిపించడం గమనార్హం. ఈ వీడియో ద్వారా ఆయన సురక్షితంగా ఉన్నారని, అధికార వ్యవస్థలో స్థిరత్వం కొనసాగుతోందని సూచించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ రాజకీయాల్లో మొజ్తాబా ఖమేనీ కీలక పాత్ర పోషిస్తున్నారని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై వచ్చిన వదంతులు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

- Advertisement -