అస్సాం అసెంబ్లీ..బీజేపీ ఫస్ట్ లిస్ట్

7
- Advertisement -

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 88 మందితో కూడిన ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను జలుక్బారి నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపింది.

పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం, భూపెన్ కుమార్ బోరా బిహ్‌పూరియా నుంచి, కృష్ణేందు పాల్ పాథర్‌కండి నుంచి పోటీ చేయనున్నారు. అశోక్ సింఘాల్‌ను ధేకియాజులి నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. రంజీత్ కుమార్ దాస్ భోవానీపూర్-సోర్భోగ్ నుంచి, ప్రద్యుత్ బోర్డోలొయ్ డిస్పూర్ నుంచి పోటీ చేయనున్నారు. జయంత మల్లా బరువా నల్బారి నుంచి, చంద్ర మోహన్ పటోవరీ తిహు నుంచి పోటీకి దిగుతున్నారు.

అలాగే బిస్వజిత్ డైమరీ తముల్‌పూర్ నుంచి, రనోజ్ పెగు ధేమాజీ నుంచి, విజయ్ మలాకర్ రామ్ కృష్ణ నగర్ నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ ఈ జాబితాలో ఆరుగురు మహిళా అభ్యర్థులకు కూడా చోటు కల్పించింది. మాధవి దాస్ (బిర్సింగ్-జారువా), జ్యోత్స్న కలిత (చామారియా), నిలిమా దేవి (మంగళ్దాయ్), అజంతా నేగ్ (గోలాఘాట్), నిసో తెరాంగ్పి (దిఫు), రూపాలి లాంగ్థాసా (హాఫ్‌లాంగ్)లను అభ్యర్థులుగా ప్రకటించింది.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత ప్రద్యుత్ బోర్డోలొయ్ బీజేపీలో చేరిన నేపథ్యంలో, ఆయన కుమారుడు ప్రతీక్ బోర్డోలొయ్ మార్గెరిటా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనని ప్రకటించారు. అయితే పార్టీతో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -