ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం

3
- Advertisement -

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్సిక చద్దాను కుల్దీప్ యాదవ్ వివాహం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతం మొస్సోరిలో ఈ పెళ్లి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు సంతోషకర వాతావరణంలో కొనసాగాయి.

కుల్దీప్ వివాహానికి భారత క్రికెట్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖులు, సన్నిహితులు కూడా ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక కుల్దీప్ యాదవ్ భారత జట్టులో ప్రముఖ స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. న అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తూ జట్టుకు ఎన్నో విజయాలను అందించారు.

ప్రస్తుతం వివాహంతో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన కుల్దీప్ యాదవ్‌కు అభిమానులు, క్రికెట్ అభిమానులు మరియు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:పెట్రోల్ లేదా డీజిల్‌ను నిల్వ చేయవద్దు:కేంద్రం

- Advertisement -