ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అయ్య అవకాశం ఉందన్నారు టీమిండియా మజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ కీలక స్థంభంగా నిలిచారు. ఆయన నాయకత్వంలో సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
అయితే ధోనీ ఇప్పుడు తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో, సీఎస్కే భవిష్యత్తు కోసం జట్టు ఇప్పటికే కొత్త ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీ కెరీర్‌లో చివరి సీజన్ కావచ్చని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతుండగానే మళ్లీ మహేంద్రసింగ్ ధోనీని చూస్తున్నాం. ఆయన చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సీఎస్కే బాధ్యతను ఆయన ఒంటరిగా మోస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బాధ్యతలను యువ ఆటగాళ్లకు అప్పగించే సమయం వచ్చింది అన్నారు.
మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ కొత్త సీజన్‌లో సీఎస్కే జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పఠాన్ తెలిపారు. యువ ఆటగాళ్లు ధోనీ అనుభవం నుంచి చాలా నేర్చుకోవచ్చని, ఆయన ఉనికి జట్టుకు ఇప్పటికీ అమూల్యమని అన్నారు.
ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించడం కష్టం. ఈ సీజన్ ఆయనను పసుపు జెర్సీలో చివరిసారి చూసే అవకాశం ఉండొచ్చు. ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం మాత్రమే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది అని పఠాన్ వ్యాఖ్యానించారు.
Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

