కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించాయి ప్రతిపక్షాలు.
ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని, ఇందులో కొత్తేముందని వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి పరమేశ్వరన్. సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించి, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత ఆర్.అశోక్.
సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు ఆరోపించారు కేంద్రమంత్రి కుమారస్వామి. పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్‌కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి విమర్శలు చేస్తున్నారని జవాబిచ్చారు సిద్దరామయ్య.
Also Read:విజయ్ – రష్మికా రిసెప్షన్..కండీషన్స్ అప్లై!
నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.

