ఇరాన్-అమెరికా వార్..ఆర్జీవీ ట్వీట్

5
- Advertisement -

ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యుద్ధ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించిన ఆర్జీవీ, “ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారి మతంలోకి నేను మారిపోతాను” అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

ఆర్జీవీ ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని సరదా వ్యాఖ్యగా తీసుకుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఆర్జీవీ ఎప్పటిలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం కొత్త విషయం కాదని అభిమానులు చెబుతున్నారు.

ఇరాన్–అమెరికా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, ఆర్జీవీ ట్వీట్ మరింత చర్చకు దారి తీసింది.

- Advertisement -