సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మార్చి 13, 2026 నుంచి ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్లో మాత్రం ఈ చిత్రంపై ఆసక్తి కనిపిస్తోంది. హోమ్ ఆడియన్స్ స్పందనే ఇప్పుడు ఈ సినిమాకు రెండో ఇన్నింగ్స్‌ను నిర్ణయించనుంది.
ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా అశికా రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు.
Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

