ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ వ్యవహారంలో DGGI…..ఫినో బ్యాంక్ సీఈఓ రిషి గుప్తాను అరెస్ట్ చేసింది.ఫినో పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన లావాదేవీల్లో భారీగా జీఎస్టీ ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం ప్రకారం, సుమారు రూ.13 కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ కార్యకలాపాలు నిర్వహించబడినట్లు గుర్తించారు. ఈ లావాదేవీలలో ఎక్కువ భాగం ఫినో బ్యాంక్ ద్వారా జరిగినట్లు వెల్లడైంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో సరైన జీఎస్టీ చెల్లించకుండా రూ.840 కోట్ల వరకు పన్ను ఎగ్గొట్టినట్లు డీజీజీఐ ఆరోపిస్తోంది.
ఈ కేసులో రిషి గుప్తాను అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మార్గాలు, సంబంధిత ఖాతాలపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై మరింత కఠిన పర్యవేక్షణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

