TG:రాహుల్‌కి సీఎం రేవంత్ స్వాగతం

4
- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీని సీఎం స్వయంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నినాదాలతో స్వాగతం పలికారు.

అనంతరం రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి వికారాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పార్టీ కార్యకలాపాలపై సమీక్ష జరపనున్నారు. సీఎంతో పాటు వికారాబాద్ పర్యటనకు ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.

వికారాబాద్‌లో నిర్వహించనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, వ్యూహాల రూపకల్పనపై నేతలు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

- Advertisement -