న్యాయవ్యవస్థలో అవినీతి..సీజేఐ తీవ్ర ఆగ్రహం

5
- Advertisement -

ఎన్సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే ప్రస్తావనపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని పూర్వ ప్రణాళికతో చేసిన చర్యగా అభివర్ణిస్తూ, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని వ్యాఖ్యానించారు.

న్యాయవ్యవస్థను ఎవ్వరూ అపకీర్తి పరచడానికి నేను అనుమతించను. దీనిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అని సీజేఐ స్పష్టం చేశారు. ఈ అంశంపై స్వయంగా సుమోటోగా స్పందించిన ఆయన, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురు తనను సంప్రదించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్ మరియు అభిషేక్ సింఘ్వీ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధించడం “అత్యంత ఆందోళనకరమైన విషయం” అని సిబల్ పేర్కొన్నారు. సింగ్‌వీ మాట్లాడుతూ రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్లలో అవినీతి ప్రస్తావన లేకుండా కేవలం న్యాయవ్యవస్థనే లక్ష్యంగా చేసుకోవడం అనుమానాస్పదమని అన్నారు.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

దీనికి స్పందించిన సీజేఐ…ఒక రోజు వేచి చూడండి. చట్టం తన మార్గంలో నడుస్తుంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే అని హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై దాడిని సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -