ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖాలిద్‌కు మద్దతుగా నిలిచారు న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ. ఇందుకు సంబంధించి స్వయంగా తాను రాసిన లేఖను పంపారు. 2020లో ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అరెస్టైన ఉమర్ ఖాలిద్ గత ఐదేళ్లుగా జైలులో ఉన్నాడు. గత నెలలో తన సోదరి వివాహం సందర్భంగా డిసెంబర్ 16 నుంచి 29 వరకు తాత్కాలిక బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది.
అయితే డిసెంబర్ 29 సాయంత్రం లోపు తిరిగి జైలుకు లొంగిపోవాలని అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బజ్పాయ్ ఆదేశించారు. అలాగే రూ.20,000 వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి రెండు ష్యూరిటీలను సమర్పించాలని పేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబర్లో అమెరికాలో ఉమర్ ఖాలిద్ తల్లిదండ్రులను కలిసిన సందర్భంగా, జోహ్రాన్ మమ్దానీ ఈ చేతిరాత లేఖను వారికి అందించారు. మేము నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను ఖాలిద్ భాగస్వామి బానోజ్యోత్స్న లాహిరి ఎక్స్ (మునుపటి ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. లేఖలో మమ్దానీ, “ప్రియమైన ఉమర్, చేదు భావాలు మనల్ని ఆక్రమించకుండా చూసుకోవాల్సిన అవసరంపై నీవు చెప్పిన మాటలు నాకు తరచూ గుర్తొస్తుంటాయి. నీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా అనిపించింది. మేమందరం నిన్నే ఆలోచిస్తున్నాం అని రాశారు.
Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

