రేవంత్ నోరు..మూసీ కన్న కంపు:హరీష్

9
- Advertisement -

రేవంత్ నోరు మూసీ నది కన్న కంపుగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ నోరు ప్రక్షాళన చేయాలి.. శాసనసభను గాంధీ భవన్‌లా మార్చారు. ముఖ్యమంత్రి విమర్శలు చేయవద్దంటే ఎలా అని ప్రశ్నించారు హరీష్.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ… మోదీని విమర్శించడం లేదా చెప్పాలన్నారు. మూసికి వ్యతిరేకం కాదు పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని తెలిపారు హరీష్.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక వీధి రౌడీనా అని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదా చెప్పాలన్నారు.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మూసీ సుందరీకరణ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

రేపు ఉదయం తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది బిఆర్ఎస్.

Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

 

- Advertisement -