ఒక స్టార్ హీరో.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు.. సినిమాకు.. సినిమాకు మార్కెట్ పెరుగుతూనే ఉంది.. తిరుగు లేదు.. ఈ మధ్య వచ్చిన ఈ స్టార్ హీరో సినిమా టాక్ బాగాలేదు.. అయినా కలెక్షన్లకు ఢోకాలేదు.. రివ్యూలు బాగాలేవు.. అయినా జనాలకు పట్టింపు లేదు.. రేటింగ్స్ పెద్దగా రాలేదు.. వారంలోనే వంద కోట్ల కలెక్షన్లు.. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. విడుదలై వారాలు గడుస్తున్నా నెగెటివ్ బజ్ మాత్రం తగ్గడం లేదు.. సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తున్నప్పటికీ.. స్టార్ హీరోపై విమర్శలు ఆగడం లేదు.
తనపై ఇంత నెగెటివ్ ప్రచారం రావడానికి కారణం ఒక టాప్ హీరో ఫ్యాన్స్‌ను హర్ట్ చేయడమేనని తెలుసుకున్నాడు ఆ స్టార్ హీరో.. ఈ నెగెటివ్ వాయిస్‌లపై వర్రీగా ఉన్న స్టార్ హీరో.. తన ముందు సినిమా రోటిన్ మాస్ మూవీ అయినప్పటికీ పూల వర్షం కురిపించిన ఫ్యాన్స్ ఎందుకు ఇంతలా విమర్శిస్తున్నారో ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఈ ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
తనను ఇంతలా ఎవరు టార్గెట్ చేస్తున్నారు.. ఫ్యాన్స్ తనను ఇంతలా ఎందుకు ద్వేశిస్తున్నారంటూ బాగా పరిశోధించి.. లోతుగా ఎంక్వైరీ చేస్తే.. ఈ నెగెటివ్ ప్రచారం వెనకాల ఓ యంగ్ హీరో ఉన్నట్టు తెలిసింది ఆ స్టార్ హీరోకి. ఆ యంగ్ హీరో టాప్ హీరోకి పెద్ద ఫ్యాన్.. ఇంకా చెప్పాలంటే దేవుడిగా కొలుస్తాడు. టాప్ హీరోపై ఈ స్టార్ హీరో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న ఈ యంగ్ హీరో.. స్టార్ హీరో ఇమేజ్‌పై దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఫిల్మ్ నగర్‌లొ వినిపిస్తున్న రూమర్ ప్రకారం స్టార్ హీరోను దెబ్బకొట్టి రివేంజ్ తీర్చుకునేందుకు.. ఈ యంగ్ హీరో ఓ సోషల్ మీడియా టీంను నియమించుకున్నట్టు సమాచారం. ఈ టీం పని ఒక్కటే.. ఆ స్టార్ హీరోపై సోషల్ మీడియాలో నెగెటెవ్ ప్రచారాలు చేసేయడం. ఈ సోషల్ మీడియా టీం.. స్టార్ హీరోపై నెగెటివ్ చేసిన ప్రచారం అన్ని రకాలుగా వర్కౌట్ అయింది.
ఈ షాకింగ్ నిజం తెలుసుకున్న స్టార్ హీరో టీం.. బాగా గ్రౌండ్ వర్క్ చేసి నిజాన్ని తెల్చేసింది. సోషల్ మీడియాలో స్టార్ హీరో ఇమేజ్‌పై దెబ్బ కొట్టేందుకు ఆ యంగ్ హీరో ఒక టీంను నియమించుకున్నట్టు స్టార్ హీరో టీం నిర్థారించుకుంది. అయితే నిజం తెలుసుకొని తేరుకునే లోపు స్టార్ హీరోను నెగెటివ్ ప్రచారం అనకొండలా చుట్టేసింది. అయితే ఈ మధ్యలో సోషల్ మీడియాను అదుపులో పెట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న స్టార్ హీరో.. పెద్ద ఎత్తున్న సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆ యంగ్ హీరో పని పట్టే టైం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అయితే ఇవి నిజమో.. అబద్దమో.. తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం దీన్ని రూమర్లకు అబ్బ అంటోంది.