నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. ఈ ఫిర్యాదులో పలువురు కీలక కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నాయి.
ఫిర్యాదు ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబె, శాం పిట్రోడా వంటి నాయకులు కలిసి కేవలం రూ.50 లక్షలు చెల్లించి, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే సంస్థకు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై పూర్తిగా నియంత్రణ సాధించారని ఆరోపిస్తున్నారు.
ఈ ఆస్తులను అన్యాయంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఉపయోగించారని, ఆ కంపెనీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కీలక వాటాలు కలిగి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవీప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ నియమాలను పక్కన పెట్టి, ప్రజా నిధులతో నడిచిన మీడియా సంస్థ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ కొత్త ఎఫ్ఐఆర్‌తో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. Congress నేతలు ఈ ఆరోపణలను రాజకీయ ప్రతీకార చర్యలుగా అభివర్ణించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీస్

