వైసీపీకి మాజీ మంత్రి విడదల రజిని గుడ్‌బై చెప్పనున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రజిని పార్టీ మార్పుపై జోరుగా సాగుతున్న చర్చలు కారణంగా ఆమె తదుపరి రాజకీయ అడుగు ఏమిటనే ఆసక్తి పెరుగుతోంది.
2024 ఎన్నికల్లో చిలకలూరిపేటకు బదులుగా గుంటూరు పశ్చిమ నుంచి పోటీకి దిగిన రజిని ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఓటమి తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తుపై పార్టీ లోపలే అనేక విమర్శలు వినిపించాయి. ఇదే సమయంలో, తాజాగా వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, రజినిని రేపల్లె నియోజకవర్గానికి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే దీనికి రజిని పూర్తిగా ససేమిరా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె రేపల్లెలోకి మారేందుకు ఆసక్తి చూపకపోవడంతో పార్టీ మార్పు చర్చలకు మరింత బలం చేకూరింది.
ఇక రజిని ఇప్పటివరకు ఈ పుకార్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మీడియా లేదా పార్టీ నేతల ముందుకు వచ్చి స్పందించకపోవడంతో ఊహాగానాలు మరింత వేగం పంచుకుంటున్నాయి. ఆమె బీజేపీ లేదా తెలుగుదేశం వైపు వెళ్లే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం రజిని వైసీపీలోనే కొనసాగుతారని అంటున్నారు.
అడుగు పెట్టినప్పుడల్లా వినూత్నంగా వ్యవహరించిన రజిని, ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై రాజకీయ పరిశీలకులు, స్థానిక నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఆమె నిర్ణయం ఏ దిశగా ఉంటుందో చూడాలి.
Also Read:కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీస్

