బిల్లుల ఆమోదంపై సుప్రీం కీలక తీర్పు

13
- Advertisement -

బిల్లులకు ఆమోదం తెలపడానికి రాష్ట్రపతికి లేదా గవర్నర్‌కు గడువు నిర్ణయించడం సరికాదని సుప్రీంకోర్టు గురువారం ఒక కీలక తీర్పులో పేర్కొంది. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం సరికాదని అపెక్స్ కోర్టు అభిప్రాయపడింది. అయితే గడువు నిర్ణయించడం అనేది అధికారాల విభజన ను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఒక బిల్లు చట్టంగా మారిన తర్వాతే రాష్ట్రపతి లేదా గవర్నర్ చర్యలు ‘న్యాయ సమీక్ష పరిధిలోకి’ వస్తాయని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.

ఆర్టికల్ 142 ను ఉపయోగించి, బిల్లులకు ‘డీమ్డ్ ఆమోదం’ ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) ప్రకారం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరిన ‘రాష్ట్రపతి రిఫరెన్స్’కు సమాధానం ఇస్తూ, గవర్నర్లకు సాధారణంగా మూడు ఎంపికలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది.

ఆమోదం ఇవ్వడం (Grant Assent).

బిల్లులను పునఃపరిశీలన కోసం వెనక్కి పంపడం (Reconsideration).

బిల్లులను రాష్ట్రపతికి రిఫర్ చేయడం (Refer to President).

భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో, గవర్నర్లకు గడువును నిర్ణయించడం అనేది రాజ్యాంగం కల్పించిన సౌలభ్యం కు వ్యతిరేకమని కోర్టు తెలిపింది.అయితే, “రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిరవధికంగా కూర్చోవడానికి గవర్నర్లకు అనియంత్రిత అధికారం ఉందని మేము అనుకోవడం లేదు అని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది.

Also Read:ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించం

తమిళనాడు కేసులో, రాష్ట్ర గవర్నర్ నిలిపివేసిన బిల్లులకు ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన ‘డీమ్డ్ ఆమోదం’ ను కూడా ధర్మాసనం ఖండించింది. ఇది రాజ్యాంగ అధికారం యొక్క విధులను స్వీకరించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ అధికారాన్ని నిర్వహించడం న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -