కేటీఆర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు!

8
- Advertisement -

మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం అన్నారు.

పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌ అని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి…. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు…. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు….కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం అన్నారు.

Also Read:బిల్లుల ఆమోదంపై సుప్రీం కీలక తీర్పు

 

- Advertisement -