నితీష్ ప్రమాణం..మంత్రుల లిస్ట్ ఇదే!

11
- Advertisement -

బీహార్‌లో నవంబర్ 20న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు,ఎన్డీఏ లోని పలువురు అగ్ర నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జెడి(యు) వర్గాల సమాచారం ప్రకారం, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ నుండి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే, నితీష్ మిశ్రా, నితిన్ నవీన్, రేణు దేవి, నీరజ్ కుమార్ బబ్లూ, సంజయ్ సరవగి, రజనీష్ కుమార్‌,జేడి (యు)విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, రత్నేష్ సదా, సునీల్ కుమార్, శ్యామ్ రజక్, జమా ఖాన్, లేసి సింగ్, దామోదర్ రావత్,.రాజు తివారీ (ఎల్‌జేపీ-రామ్ విలాస్), సంతోష్ కుమార్ సుమన్ (హెచ్‌ఏఎం), స్నేహలత కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎం) ప్రమాణస్వీకారం చేయనున్నట్ల సమాచారం.

243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇందులో బీజేపీ 89, జేడీ(యు) 85, ఎల్‌జేపీ(ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎం 5 మరియు ఆర్‌ఎల్‌ఎం 4 స్థానాలను గెలుచుకున్నాయి.

Also Read:9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం

- Advertisement -