మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క. ఇందిరాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ ఆడ బిడ్డలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో రేవంతన్న ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నారు అన్నారు సీతక్క.
మహిళలను సంఘటితం చేసేందుకు కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పిస్తున్నారు … కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం సీఎం ప్రారంభిస్తున్నారు అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. దేశ ప్రగతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయురాలు ఇందిరా గాంధీ… దేశ సమైక్యత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు అని కొనియాడారు.
అణు శక్తి, గ్రీన్ రివల్యూషన్, మహిళా సాధికారతకు పునాది వేసిన నేత ఇందిరమ్మ… పేదల కోసం నిలిచిన నాయకురాలు ఇందిరమ్మ….ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది అన్నారు.
Also Read:Hyd:రెండో రోజు ఐటీ సోదాలు

