తెలంగాణలో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 9, 2025 తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావుకు గతంలో మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు చేపట్టింది.
అయితే, ప్రభాకర్ రావు తరపు న్యాయవాది విచారణ సమయంలో అందుబాటులో లేకపోవడంతో, కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతివాదుల తరఫు న్యాయవాది లేకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. డిసెంబర్ 9న ఈ కీలక పిటిషన్‌పై విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాత్రపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు నిర్ణయంపై అందరి దృష్టి ఉంది.
Also Read:పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల..విచారణ

