పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల లోన్లు ఎగ్గొడితే ఎలాంటి నిబంధనలు లేవు కానీ రైతులకు ఇన్ని నిబంధనలు ఎందుకు? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. పత్తి పంట కొనుగోలు చేసేందుకు KAPAS KISAN యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబంలో నుండి ఎవరు పంట తెచ్చినా కొనుగోలు చేసే విధానం తేవాలి… ఈ నెల 21వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు కేటీఆర్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నాయి… ఈరోజు పత్తి రైతులకు వచ్చిన కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు అన్నారు.
రైతు బాగుపడాలి గుండెల నిండా ప్రేమ ఉన్న వ్యక్తి నాయకుడు అయితేనే రైతుల జీవితాలు బాగుపడతాయి, ఇలాంటి వాళ్లు గెలిస్తే ఎలాంటి లాభం ఉండదు.. ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే వరకు మీ కోసం మేము పోరాడతాము అన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామని సీసీఐ చెప్తుంది, కొన్ని చోట్ల ఒక్కో ఎకరాకు 20 క్వింటాళ్ల పత్తి పండుతుంది మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మాయిశ్చర్ కంటెంట్ మీద పెట్టిన నిబంధనలు కూడా ఎత్తివేసే వరకు పత్తి రైతుల తరపున మా పార్టీ కొట్లాడుతుంది అని తేల్చిచెప్పారు.
Also Read:

