బీహార్‌లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు ధృవీకరించిన ప్రకారం, నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఉపముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కొత్త ఎన్డీయే ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 20, 2025న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరగవచ్చని భావిస్తున్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అవుట్గోయింగ్ ఎన్డీయే ప్రభుత్వ చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో, అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తూ కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కలుసుకున్నారు. “కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేయడానికి సీఎం సమావేశం తర్వాత ఆయనను కలిశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత, సంకీర్ణ పార్టీల నాయకులు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించడానికి నితీష్ కుమార్‌తో సమావేశమయ్యారు. కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని బీజేపీ నాయకులు ధృవీకరించారు.
ఉపముఖ్యమంత్రిపై గందరగోళం లేదు అని, ఆ నిర్ణయాలన్నీ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని తారకిషోర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆయన చెప్పారు.
Also Read:కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఈటల సీరియస్..

