KLSR INFRATECHపై అంత ప్రేమ ఎందుకు?

7
- Advertisement -

దివాలా తీసిన కేసు గురించి సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కుంటున్న KLSR INFRATECH అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇస్తుంది? చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.

తమిళనాడు రాష్ట్రంలో ఒక జడ్జిని బెదిరిస్తున్నారని, ఈ సంస్థ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది అన్నారు. ఇన్ని ఆరోపణలు ఉన్న నెల్లూరుకు చెందిన ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు? చెప్పాలన్నారు. ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఈడీ గతంలో ప్రకటన చేసినా కూడా చర్యలు ఎందుకు లేవు ? అని ప్రశ్నించారు.

పదేండ్ల పాటు కేసీఆర్‌ హయాంలో ఎంపీ, ఎంఎల్సీ వంటి పదవులు అనుభవించినప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? చెప్పాలన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బీఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన కామెంట్స్‌పై స్పందించిన వివేకా..ఎవరికి ప్రయోజనం కలిగించడానికి కవిత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతుంటే వాటిని ప్రశ్నించకుండా, గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేలా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది అన్నారు.

Also read:కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఈటల సీరియస్..

- Advertisement -