- Advertisement -
రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రోజు కూర్చొని చేయకూడని పనులు చేస్తున్నాడా? చెప్పాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. కేసీఆర్ ప్రారంభోత్సవానికి ఒకసారి పోయి, పోలీసులతో పనులు చేయించాడు కాబట్టే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండేది అన్నారు.
రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అజ్ఞానం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి… ప్రగతి భవన్ బాత్రూంలో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉన్నాయా? సిగ్గనిపిస్తలేదా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనకు భయం మొదలైనట్లు తెలుస్తుంది… జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవికి ఉపద్రవం వస్తున్నట్లుంది… జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం కాదు అన్నప్పుడే రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నాడు అన్నారు.
Also Read:ECB..సంచలన నిర్ణయం!
- Advertisement -

