K-Ramp:కే ర్యాంప్ ఓటీటీ డేట్

6
- Advertisement -

కిరణ్ అబ్బవరం దీపావళి కానుకగా విడుదల చేసిన “కే-రాంప్” విజయం సాధించింది. జైన్స్ నాని అనే తొలి దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ డండా, శివ బొమ్మక్కు సంయుక్తంగా హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో యువ నటి యుక్తి థారేజా హీరోయిన్‌గా నటించింది.

థియేట్రికల్ రన్ ముగిసింది, ఇక ఈ సినిమా నవంబర్ 15న Ahaలో OTT ప్రీమియర్ కానుంది. పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు ఆహాకే ఉన్నాయి. థియేట్రికల్ విండో నాలుగు వారాలు మాత్రమే.

కే-రాంప్ కథ కుమార్ (కిరణ్ అబ్బవరం) అనే ధనిక యువకుడి చుట్టూ తిరుగుతుంది. PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్)తో బాధపడే ఒక యువతితో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎలా తారుమారవుతుందన్నదే కథ. ఈ చిత్రంలో సాయికుమార్, నరేశ్ విజయకృష్ణ, కమ్నా జెఠ్మలాని, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చైతన్ భారద్వాజ్ సంగీతం అందించగా, రవీంద్రన్ రాజా సంభాషణలు రచించారు.

Also Read:ECB..సంచలన నిర్ణయం!

- Advertisement -