మహిళల వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతగా ప్రేక్షకులకు మహిళ క్రికెట్‌ను చెరవేసేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఎనిమిది జట్లతోనే మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తూ రాగా తాజాగా ఐసీసీ 10 జట్లను అనుమతించనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్లాలనే తమ సంకల్పాన్ని నెరవేర్చుకోనుంది.
భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్టేడియానికొచ్చి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చూశారు. మహిళా వరల్డ్ కప్ చరిత్రలో ఇంతమంది ఫ్యాన్స్ పోటెత్తడం అనేది ఓ రికార్డు. దీంతో పద్నాలుగో సీజన్ వన్డే వరల్డ్ కప్ పది జట్లతో సందడిగా జరుగడం ఖాయమన్నమాట.
అలాగే పురుషుల మాదిరిగానే ఇకపై మహిళా విజేతలకు సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించింది. ఈ నిర్ణయం కూడా మహిళా క్రికెట్ పురోగతికి బాటలు వేసిందనే చెప్పాలి.
Also Read:Operation Pimple:ఇద్దరు ఉగ్రవాదులు హతం

