AQI:కాలుష్య కోరల్లో ఢిల్లీ..

6
- Advertisement -

గ్యాస్ ఛాంబర్ లా మారింది దేశ రాజధాని ఢిల్లీ. కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు హస్తిన ప్రజలు. అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది గాలి కాలుష్యం. ఆలీపూర్ లో 421కి పడిపోయింది గాలి నాణ్యత.

అత్యధికంగా 421, అత్యల్పంగా 216 నమోదు అయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI. ఢిల్లీ కాలుష్యంపై అధికార, విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఢిల్లీలోని కొన్ని వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు “తీవ్ర” (Severe) స్థాయిలో కాలుష్యాన్ని నమోదు చేశాయి, అంటే 400 మార్కును దాటాయి. వాటిలో ముఖ్యంగా వజీర్‌పూర్ (403), జహాంగీర్‌పురి (402), బవానా (396) అత్యధిక కాలుష్య ప్రాంతాలుగా నమోదయ్యాయి . మొత్తం 14 కేంద్రాలు “చాలా దారుణం” వర్గంలో వాయు నాణ్యతను నమోదు చేశాయి.

AQI వివరాలు (ఉదయం 7 గంటల నాటికి)
సం. వాయు నాణ్యత కేంద్రం AQI
1 వజీర్‌పూర్ 403
2 జహాంగీర్‌పురి 402
3 బవానా 396
4 ఆనంద్ విహార్ 392
5 రోహిణి 392
6 వివేక్ విహార్ 391
7 బురారి క్రాసింగ్ 390
8 నరేలా 388
9 అశోక్ విహార్ 370
10 పంజాబీ బాగ్ 361
11 ఐటీఓ 348
12 ముండ్కా 343
13 పాట్‌పర్‌గంజ్ 342
14 ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ 341
15 నెహ్రూ నగర్ 323
16 షాదీపూర్ 311

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

AQI వర్గీకరణ:

మంచిది (Good): 0–50

సంతృప్తికరమైనది (Satisfactory): 51–100

మోస్తరు కాలుష్యం (Moderate): 101–200

దారుణం (Poor): 201–300

చాలా దారుణం (Very Poor): 301–400

తీవ్రం (Severe): 401–500. AQI సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాయు నాణ్యత మరింత హానికరమవుతుంది.

- Advertisement -