TTD:5న అన్నాభిషేకం

8
- Advertisement -

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు.

సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

- Advertisement -