ఆస్ట్రేలియాలోని 4 నగరాల్లో 7 రోజుల తన పర్యటన ముగిసిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మన శ్రామిక శక్తి బలోపేతానికి అవకాశాలు పరిశీలించా..పరిశోధన, అభివృద్ధి(R&D) నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
క్రీడలను కూడా ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లే పెద్ద అవకాశంగా చూస్తున్నా.. ఆస్ట్రేలియా టూర్ నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నా అన్నారు. త్వరలో ఏపీకి ఉపయోగపడే భాగస్వామ్యాలుగా మారతాయి అని తెలిపారు లోకేశ్.
మనం $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న వేళ, మన ఉద్యోగ బలాన్ని బలోపేతం చేయడం, ఆర్‌అండ్‌డీ (R&D) అభివృద్ధి చేయడం, మరియు నైపుణ్యంతో కూడిన ప్రతిభను పెంపొందించడం కీలకం అన్నారు. ఈ పర్యటన నాకు అపారమైన అనుభవాలను, కొత్త ఆలోచనలను అందించింది అని తెలిపారు.
And that’s a wrap! My 7-day tour of #Australia across four cities comes to an end. From universities and leading industries to #India–Australia councils, seafood trade bodies, and sports complexes – it’s been a deeply insightful journey.
As we drive towards a $2.4 trillion… pic.twitter.com/bnYx6YuFOd
— Lokesh Nara (@naralokesh) October 25, 2025
Also Read:ఫలించిన హరీశ్ రావు కృషి

