ఫలించిన హరీశ్ రావు కృషి

13
- Advertisement -

మాజీ మంత్రి హరీశ్ రావు కృషితో జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. జోర్డాన్ నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు 12 మంది వలస కార్మికులు. ఈ సందర్భంగా హరీశ్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు కార్మికులు.

తమను స్వదేశానికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావుకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల గోడు విన్న హరీశ్‌.. 12 మందికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఎట్లయినా మిమ్మల్నితీసుకువస్తాం అని భరోసా ఇచ్చారు.

ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లారు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లా వాసులు. తమను విడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాయం కోరారు బాధితులు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్ బాధితులను విడిపించాం అన్నారు హరీశ్‌. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు… అందుకే పెనాల్టీ కట్టి వారిని తీసుకొచ్చాం అన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతామని రేవంత్ గొప్పలు చెప్పారు.. రెండేండ్లయినా అడుగు ముందుకుపడలేదు అన్నారు హరీశ్ రావు.

Also Read:TTD: జలాశయాలకు జలకళ

- Advertisement -