- Advertisement -
నేటి నుంచి ఛఠ్ పూజ ప్రారంభంకానుంది. ఈ నెల 28 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది ఛఠ్ పూజ. ఛఠ్ పూజ సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా.
సూర్య దేవుని ఆరాధనకు ముఖ్యమైన ఈ పర్వదినాన్ని నదులు, చెరువులు, జలాశయాల వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, నేపాల్ తో సహా ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో ఛఠ్ పూజను జరుపుకుంటారు.
ఛఠ్ పూజ కోసం దేశవ్యాప్తంగా 12 వందల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది కేంద్ర రైల్వే శాఖ.
Also Read:ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు!
- Advertisement -

