ప్రధాని మోదీ వచ్చే వారం మలేషియాలో జరిగే ఆసియాన్ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు అని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ట్రంప్‌తో భేటీ ఉండదు అని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ..భారత్ తరపున ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపింది. అలాగే ఆసియాన్ సదస్సు అక్టోబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ సమస్యల కారణంగా అక్టోబర్ 26 నుంచి మలేషియాలో ప్రారంభమయ్యే ఆసియాన్ సదస్సు సమావేశాలకు హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. భారత తరపున చర్చల్లో బాహ్య వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశం మలేషియాకు ఇప్పటికే తెలియజేసిందని, జైశంకర్ భారత ప్రతినిధి బృందాన్ని నడిపిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆసియాన్‌లో పది సభ్య దేశాలు ఉన్నాయి.ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ మరియు కంబోడియా.ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం మరియు ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత మరియు రక్షణ రంగాలలో భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
Also Read:‘కాంత’ ..క్లాస్ రొమాంటిక్ మెలోడీ

