పాక్ వన్డే కెప్టెన్‌గా ఆఫ్రిది

6
- Advertisement -

పాకిస్తాన్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది నియమితులయ్యాడు. నవంబర్ 4 నుంచి 8 వరకు దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో తన కెప్టెన్సీ బాధ్యతలను ప్రారంభించనున్నాడు ఆఫ్రిది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీని వదిలిపెట్టిన తర్వాత గత సంవత్సరం ఆ బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అఫ్రిది నియమితులయ్యాడు.

2024 ప్రారంభంలో ఆఫ్రిది పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా నియమించారు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఒక ద్వైపాక్షిక సిరీస్‌కే ఆయన నాయకత్వం వహించాడు. ఐదు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో పాకిస్తాన్ కేవలం చివరి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కొద్ది నెలల తరువాత బాబర్ మళ్లీ టీ20 కెప్టెన్‌గా నియమితులయ్యాడు.

అఫ్రిది కెప్టెన్‌గా నియమించాలన్న నిర్ణయం వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆక్బ్ జావేద్ మరియు సెలెక్షన్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో తీసుకున్నారు. అఫ్రిది … పాకిస్తాన్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి 194 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాడు.

Also Read:H1B:విద్యార్థులకు భారీ ఊరట

- Advertisement -