ప్రాణాలకు భయపడే వ్యక్తిని కాను:చంద్రబాబు

12
- Advertisement -

మనం చేసే పనులే శాశ్వతం.. ప్రాణాలకు భయపడే వ్యక్తిని కాను అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.

లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం, ప్రజల భద్రత కోసం రాజీ లేని పోరాటం చేశాను… దాని ఫలితమే 2003లో నా మీద 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ఘటన అన్నారు. విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం… రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే గూగుల్ ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది అన్నారు.

ప్రపంచానికే విశాఖ ఓ ఐటీ, ఏఐ హబ్ గా తయారవుతుంది… పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు అన్నారు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారు… సకాలంలో పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం అన్నారు. కల్తీ మద్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను… రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారు… పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు అన్నారు.

- Advertisement -