బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 38 రోజులు పూర్తి చేసుకుంది. ఉదయాన్నే గిన్నెలు తోమడానికి వెళ్లి రీతూ తిట్టుకుంది.. ఎవరైనా తినడం లేటయ్ అర్ధరాత్రి తినేవాళ్లయితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్.. పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది అన్నారు. మళ్లీ పొద్దున్న వేస్తే ఎలా అంటూ రీతూ చిరాకు పడింది.
కాసేపటికి డిషెస్ వాష్ చేయడానికి అయేషా కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ రాత్రి వాడిన దోశ పిండి గిన్నె కనిపించింది. దీంతో రీతూ ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా.. నాకు ఇటు స్పేస్ కావాలి.. అని చాలా సింపుల్‌గా నెమ్మదిగా రీతూని అడిగింది అయేషా. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా.. కెప్టెన్.. నేను క్లియర్‌గా కెప్టెన్‌కి చెప్పా.. అక్కడ నేను అన్నీ క్లియర్ చేశాను.. అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను.. అక్కడ పెట్టుంటేనే నేను చేస్తానని చెప్పాను అన్నారు.
ఇంతలో కళ్యాణ్ మధ్యలో మాట్లాడాడు. అయేషా పాయింట్ ఏంటంటే అది రాత్రి వాడిన గిన్నె కదా నేనెందుకు కడుగుతాను అంటుంది.. రీతూ పాయింట్ ఏంటంటే అది ఉదయాన్నే వేశారు కదా.. అని కళ్యాణ్ చెప్పాడు. ఇది నేను కడగను అని చెప్పట్లేదు అర్ధరాత్రి వేశారు అంటున్నాను.. అని రీతూ చెప్పింది. అవన్నీ నాకు అవసరం లేదురా నువ్వు తర్వాత చేస్తావ్ కదా.. అని అయేషా అడిగితే చేస్తాను.. అని రీతూ అంది.
ఇంతలో అయినా కెప్టెన్ ఆ గిన్నె మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది.. అంటూ మాధురి మాట్లాడింది. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉందా నైట్ పెట్టారు తెలుసుకోండి.. మీకు అసలు తెలీకుండా వచ్చి మధ్యలో మాట్లాడకండి.. అర్ధరాత్రి తీసిన పిండి అది.. అంటూ మాధురిపై ఫైర్ అయింది రీతూ. దీంతో సుమన్ గారు ఇది ఇక్కడే ఉంది కదా పిండి.. బయట ఉందా.. అని మాధురి అడిగింది. లేదు బయటే ఉంది.. అని సుమన్ చెప్పాడు. వెంటనే పిండి ఉన్న గిన్నె నేను ఎలా కడుగుతాను సింక్‌లో వేశారా.. అంటూ రీతూ పాయింట్ మార్చింది. దీంతో మరి ఇప్పటివరకూ ఫ్రిడ్జ్‌లో ఉందన్నావ్.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావ్.. అని మాధురి కొశ్చన్ చేసింది. మీరు ఏది పడితే అది మాట్లాడకండి.. అంటూ రీతూ అరిచింది. ఏంటి ఏయ్ ఏంటి.. నీకు ఒక స్టాండ్ లేదా.. అంటూ మాధురి ఫైర్ అయింది. ఏంటి స్టాండ్ ఏం తెలీకుండా మధ్యలో దూరిపోకండి.. అంటూ రీతూ కూడా అరిచింది.
ఇక పక్కకెళ్లి మళ్లీ కళ్యాణ్-దివ్యలతో ఏదో గొణికింది రీతూ. దీంతో కిచెన్‌లో గిన్నెలు తోముతూ అద్దంలో నుంచి చూస్తూ రీతూ ఆపేస్తావా ఇంక.. అని అయేషా సీరియస్ అయింది. నువ్వెవరు ఆపేయమనడానికి.. అని రీతూ అనగానే అయిపోయింది ఆ టాపిక్ అని అయేషా చెప్పింది.
Also Read:నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం: ఫడ్నవీస్

