నక్సల్ ఫ్రీ భారత్‌ నిర్మిస్తాం: ఫడ్నవీస్

8
- Advertisement -

మావోయిస్టులు లేని భారత్‌ను నిర్మిస్తాం అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ ఉద్యమాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట ఆయన లొంగిపోయారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఫడ్నవీస్.. మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. దేశంలో మావోయిజానికి చోటు లేదు అని తెలిపారు. ఈ సందర్భంగా వారికి రివార్డులు అందించారు ఫడ్నవీస్.

మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ ఇటీవల ఆయన పలుమార్లు లేఖలు రాశారు. ఈక్రమంలో బుధవారం 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి సీఎం సమక్షంలో గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

Also Read:ఎన్నికల్లో పోటికి పీకే దూరం!

- Advertisement -