ప్రపంచ క్రీడా పటంలో భారత్!

13
- Advertisement -

2030 కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడంపై ఎక్స్ వేదికగా స్పందించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. భారత్ బిడ్ ను కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదించినందుకు ప్రతి భారతీయ పౌరుడికి అభినందనలు తెలిపారు. భారత్ ను ప్రపంచ క్రీడా పటంలో ఉంచడానికి ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి చేశారు అన్నారు.

భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2030 జరగనున్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ నిర్వహణ హక్కులను దక్కించుకుంది భారత్.గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని వేదికగా ఎంపిక చేస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి ఆతిథ్య హక్కులను దక్కించుకుంది అహ్మదాబాద్. నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో అధికారిక ప్రకటించనుంది ఎగ్జిక్యూటివ్ బోర్డు.

Also Read:నక్సల్ ఫ్రీ భారత్‌ నిర్మిస్తాం: ఫడ్నవీస్

- Advertisement -