- Advertisement -
పీఎం కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఒకే ఇంట్లో భార్య, భర్తలు ఇద్దరికీ నిధులు జమ అయితున్నట్లు గుర్తించారు అధికారులు. 31 లక్షల అనుమానస్పద ఖాతాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం.
దేశంలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నట్టు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. 31.01 లక్షల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, బుధవారం(అక్టోబర్ 15) నాటికి అన్ని ఖాతాలు తనిఖీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ.
ఇప్పటి వరకు 19.02 లక్షల ఖాతాలు తనిఖీ చేసి 17.87(93.98%) ఖాతాలను అనర్హులుగా గుర్తించాయి రాష్ట్రాలు. భార్య, భర్తతోపాటు గత యజమానులకు కూడా నిధులు జమ అవుతున్న ఖాతాలను గుర్తించగా రేపటి లోగా కేంద్రానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..
- Advertisement -

