పరకామణి అక్రమాలపై ఏపీ హైకోర్టు ఫైర్

10
- Advertisement -

తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను ఎందుకు సీజ్‌ చేయలేదని ప్రశ్నించింది.

ఈ మేరకు ఏపీ పోలీసు శాఖ తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సీఐడీ డీజీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

పరకామణిలో శ్రీవారి నగదు అపహరణ, కేసు నమోదు, లోక్‌ అదాలత్‌లో రాజీకి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేసి తదుపరి విచారణకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు.

Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..

- Advertisement -