బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరుగుతాయని.. SIRతో బిహార్ ఓటర్ల జాబితాను ప్రక్షాళించాం అన్నారు సీఈసీ జ్ఞానేశ్ కుమార్. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెలువడనున్నాయి.ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందన్నారు. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీలో 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇకపై నుండి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు.
సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ఆగస్టు 1న పూర్తి ఎన్నికల జాబితాను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. 85 ఏళ్ల కంటే పై బడిన వారు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల జాబితాలో ఓటర్ పేరు నమోదైన 15 రోజుల్లో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
వందేళ్లు పై బడిన ఓటర్లు 14 వేల మంది ఉన్నట్లు తెలిపారు జ్ఞానేశ్ కుమార్. ఈ సారి 14 లక్షల మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని..వందశాతం వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. బిహార్ ఎన్నికల నుండి కొత్తగా 17 సంస్కరణలు చేపట్టామని వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.ప్రతీ పోలింగ్ బూత్‌లో 1200 మందికి మించి ఓటర్లు ఉండరని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులకైనా ఓటర్లు 1950 నెంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.
Also Read:ముంబైలో ఏపీ మంత్రి లోకేశ్
బీహార్ ఎన్నికల్లో మొదటి సారి అభ్యర్థుల కలర్ ఫోటోలు పెడుతున్నామని ఈసీ ప్రకటించింది. మొత్తంగా 17 కొత్త సంస్కరణలు ఈ ఎన్నికల్లో తెస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో లోపాలు, అవకతవకల నివారణకు చాలా అలర్డ్ గా ఉంటామని, పిలిస్తే పలుకుతామని కమిషన్ ప్రకటించింది. యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ కు 1950 ఎన్నికల ఫిర్యాదులను చేయవచ్చని తెలిపింది. ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఈసీ తెలిపింది.
Bihar Elections Schedule PDF..Click Here BIHAR-2025_6th October

