నా హృదయం ముక్కలైంది: విజయ్

13
- Advertisement -

కరూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించారు TVK అధినేత విజయ్. నా హృదయం ముక్కలైంది.. చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంతో నేను విలవిలలాడుతున్నా అన్నారు.

కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు.

కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. అరగంటలోనే పెను విషాదాన్ని మిగిల్చింది దుర్ఘటన. విజయ్ ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే జనంలో తొక్కిసలాట జరిగింది. గాయపడినవారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

- Advertisement -