NBK:డిసెంబర్ 5న అఖండ 2!

9
- Advertisement -

అఖండ-2 సినిమా డిసెంబర్‌ 5న విడుదల అవుతుంది అని రిలీజ్ డేట్ చెప్పేశారు హీరో నందమూరి బాలకృష్ణ. ఎల్లుండి తమ్ముడు పవన్‌ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నాం అన్నారు.

హిందీ డబ్బింగ్‌ కూడా బాగా వచ్చిందని బోయపాటి చెప్పారు ….అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చిట్ చాట్ లో వెల్లడించారు నందమూరి బాలకృష్ణ.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, సి. రాంప్రసాద్ డీవోపీగా వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తుండగా, ఏఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

Also Read:వాహనాలపై కులం పేర్లు..జరిమానా!

- Advertisement -