ఆదివాసీలు దేశానికి మూల పురుషులు!

8
- Advertisement -

ఇది బాధ్యత మాత్రమే కాదు భావోద్వేగం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్… ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎప్పుడు అవకాశం వచ్చినా మేడారం తల్లుల ఆశీర్వాదం తీసుకుని పనిచేస్తున్నా అని చెప్పారు.

నా పాదయాత్ర మేడారం నుంచే మొదలుపెట్టాను… ప్రజలకు ప్రజా పాలన అందించాలనే సంకల్పంతో సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర చేపట్టాను అన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి అన్నారు.

ఆదివాసీలు దేశానికి మూల పురుషులు… వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పనిచేస్తాం అన్నారు. ఆదివాసీల నియోజకవర్గాలలో సంక్షేమ పథకాల కోటా పెంచి అందిస్తున్నాం… అనాదిగా ఆదివాసీలకు జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ ఈ జన్మలో మాకు దక్కిన అదృష్టం… సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం అన్నారు. గిరిజన వారసులను కలుపుకొని ముందుకు వెళ్తాం అన్నారు. అంతకముందు మేడారం సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లకు 68 కేజీల బంగారం సమర్పించారు సీఎం రేవంత్.

Also Read:బ్రహ్మోత్సవాలు..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

- Advertisement -