జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

8
- Advertisement -

జంట జలాశయాలు ఉస్మాన్ సాగన్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్లు ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు అధికారులు.

ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1789.50 ఫీట్లకు చేరుకుంది వరద నీరు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1763.20 ఫీట్లకు చేరుకుంది వరద నీరు.

నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తమయ్యారు జలమండలి అధికారులు. జంట జలాశయాలకు ఇంకా వరద నీరు వచ్చే అవకాశం ఏంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

Also Read:TTD:16న పవిత్రోత్సవాలకు అంకురార్పణ

- Advertisement -