అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. డల్లాస్ నగరంలో ఓ మోటెల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు చంద్రమౌళి నాగమల్లయ్య(50). భార్య, కొడుకు చూస్తుండగానే నాగమల్లయ్య తల నరికాడు దుండగుడు.
నాగమల్లయ్య వద్ద పని చేస్తున్న మార్టినెజ్ అనే వ్యక్తితో వాషింగ్ మెషీన్ విషయంలో చిన్న గొడవే కారణం అని తెలుస్తోంది. మాటామాటా పెరిగి ఆవేశంలో మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచారు మార్టినెజ్.
అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంటాడి.. అతని తలను నరికి చెత్తకుప్పలో పడేశాడు మార్టినెజ్. నిందితుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లయ్య హత్య తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని ‘ఎక్స్’ వేదికగా స్పందించింది భారత కాన్సులేట్.
Also Read:TTD:16న పవిత్రోత్సవాలకు అంకురార్పణ

