- Advertisement -
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగగా రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు.
మాజీ ఉప రాష్ట్రపతులు జగ్‌దీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ కూటమి రంగంలోకి దింపగా, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థిపై 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
Also Read:TTD:16న పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- Advertisement -

