మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ #Mega157. చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు #Mega157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 05 నుంచి సెప్టెంబర్ 19 వరకు శరవేగంగా జరుగబోతున్నట్లు ఇందులో రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రకరించబోతున్నట్లు చిత్రబృందం చెప్పుకోచ్చింది. అలాగే అక్టోబర్‌లో జరిగే షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్లో వెంకటేశ్ జాయిన్ కాబోతున్నట్లు ప్రకటించింది.
Also Read:బీఆర్ఎస్కు కేసీఆరే సుప్రీం:హరీష్

